![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ లో ఎనిమిదవ వారం ఆట సందీప్ ఎలిమినేషన్ అవ్వగా, తొమ్మిదవ వారం టేస్టీ తేజ ఎలిమినేటెడ్ అయ్యాడు. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో చివరగా రతిక, తేజ ఉన్నారు. ఇక రతిక ఎమోషనల్ అయింది. ఈ ఒక్కవారం నాకు ఛాన్స్ ఇవ్వండి సర్ అంటూ నాగార్జునని రిక్వెస్ట్ చేసుకుంది రతిక. నా చేతుల్లో ఏమీ లేదు. ప్రేక్షకులు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారంటూ నాగార్జున చెప్పాడు. దాంతో రతిక ఏడ్చేసింది.
ఆదివారం నాటి ఎపిసోడ్ లో మొదటగా భోలే షావలిని సేవ్ చేయటంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత అమర్ దీప్ సేవ్ అయ్యాడు. ఇలా ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ చివరగా యావర్, రతిక, టేస్టీ తేజ ఉండగా.. యావర్ సేవ్ అయ్యి ఫైనల్ ఎలిమినేషన్ లో రతిక, తేజ ఉన్నారు. ఆ తర్వాత తేజ ఎలిమినేట్ అయ్యడు. ఆ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో టేస్టీ తేజని మొదట అంబటి అర్జున్ నామినేట్ చేయగా, రెండవ నామినేషన్ గా శివాజీ చేశాడు. అయితే ఇద్దరు ఇంచుమించుగా ఒక్కటే చెప్పారు. తేజ ప్రతీ నామినేషన్ లో సిల్లీ నామినేషన్ చేస్తున్నాడంటు శివాజీ, అంబటి అర్జున్ అన్నాడు. ఇక తేజ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పగానే శోభాశెట్టి ఫుల్ ఎమోషనల్ అయింది.
టేస్టీ తేజ హౌస్ లో కామెడీని చేస్తు ఉన్న ఎనిమిది వారాలు బాగున్నాడు. ఒక్క నామినేషన్ లో అతను చేసిన సిల్లీ రీజన్స్ తప్ప, హౌస్ మేట్స్ తో సరదాగా ఉన్నాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు శోభాశెట్టితో ఎక్కువగా ఉన్నాడు. తేజ రోజుకి 21 వేల చొప్పున నెలకు తొమ్మిది వారాలకు గాను 13 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే తేజది అన్ ఫెయిర్ నామినేషన్ అంటూ శోభాశెట్టిని కావాలనే సేవ్ చేశారంటూ నెటిజన్లు భావిస్తున్నారు.
![]() |
![]() |